శివాజీనగర: కేంద్రం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల పెండింగ్, మేకెదాటు, మహదాయి ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరు, జలజీవన్ మిషన్ పథకంలో పెండింగ్ సొమ్ముల విడుదల, బెంగళూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కృష్ణా అప్పర్ ఎగువ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడం, ఇతరత్రా అత్యవసర నిధుల మంజూరు కోసం ప్రధాని నరేంద్రమోదీకి సీఎం సిద్దరామయ్య విన్నవించారు. బుధవారం ఉదయం ఆదిచుంచనగిరి మఠానికి వెళ్లేందుకు ప్రధాని ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య తదితరులు పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు.
హైస్పీడ్ రైల్ కారిడార్
ఈ సందర్భంగా ప్రధానికి సీఎం వినతిపత్రాన్ని సమర్పించారు. కోలారు రైల్వే కోచ్ కర్మాగారం పెండింగ్‌లో ఉందని చెబుతూ, ఆ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం 123 ఎకరాల భూమిని ఇస్తుందని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. బెంగళూరు–మైసూరు మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బెంగళూరు సబర్బన్ రైల్వే పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్వాగత వేళలో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో ఏదో చెప్పడం, సిద్దు అలాగే అన్నట్లు తలాడించడం ఉత్కంఠకు కారణమైంది.
ప్రధాని మోదీకి సీఎం సిద్దు వినతిపత్రం
విమానాశ్రయంలో ఉభయులూ గుసగుస


