ఒంటరి ఏనుగు ఎస్కేప్‌ | - | Sakshi
Sakshi News home page

ఒంటరి ఏనుగు ఎస్కేప్‌

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

బనశంకరి: బేలూరు తాలూకా కణగుప్పె గ్రామంలో రైతును బలితీసుకున్న ఒంటరి ఏనుగును 6 పెంపుడు ఏనుగుల సాయంతో అధికారులు బంధించినప్పటికీ అది తప్పించుకుని ఉడాయించింది. ఒంటరి ఏనుగు కోసం పెంపుడు ఏనుగులు సుగ్రీవ, ధనుంజయ, అయ్యప్ప, ఏకలవ్య, శ్రీరామతో కలిసి అటవీ సిబ్బంది బుధవారం బేళూరు తాలూకా కెరగూడు గ్రామంలో కాఫీతోటలో గాలించారు. ఆకతాయి ఏనుగు తారసపడగానే అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. అయితే మత్తు వీడిన తర్వాత అడవి ఏనుగు కాలికి కట్టిన తాడును తొలగించుకొని ఉడాయించింది. దీంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతానికి గాలింపు నిలుపుదల చేసి పెంపుడు ఏనుగులను శిబిరానికి తరలించారు.

మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినా ఫలితం శూన్యం

Advertisement
 
Advertisement
Advertisement