హొసపేటె: ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో హోంగార్డ్ ఇల్లు కాలిపోయిన ఘటన విజయనగర్ జిల్లా, హొసపేటె తాలూకాలోని హంపీ ఎంపీ ప్రకాష్ నగర్‌లో ఆదివారం జరిగింది. పీ.బాషాసాబ్ అనే హోంగార్డు రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఆదివారం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో రేకుల ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లోని ఆహారం, ధాన్యం, పాత్రలు, బియ్యం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఇంట్లోని పిల్లలు, భార్యకు ఎలాంటి హాని జరగలేదు. మంటలను ఆర్పివేయడానికి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారు.


