ఒక్కో ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్‌ టికెట్లు | - | Sakshi
Sakshi News home page

ఒక్కో ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్‌ టికెట్లు

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

బనశంకరి: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు టికెట్‌ ఇవ్వాలన్న ఎమ్మెల్యేల డిమాండ్‌ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ), డీఎన్‌ఏ, ఆర్‌సీబీ ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు. ఇంతకుముందు ఒక్కో ఎమ్మెల్యేకు 2 ఉచిత టికెట్లు ఇవ్వాలని అనుకోగా, ఈ భేటీలో దానిని 3కు పెంచడం గమనార్హం. బెంగళూరులో జరిగే ప్రతి మ్యాచ్‌కు 3 టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు. డీకే శివకుమార్‌ మాట్లాడుతూ 3 ఉచితమని, ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు కొనుగోలు చేయాలని చెప్పారు. చిన్నస్వామి స్టేడియంలో సీట్లు పెంచాలని కేఎస్‌సీఏ ఆలోచిస్తోందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని తెలిపామన్నారు. మరో క్రికెట్‌ స్టేడియాన్ని ఎక్కడ కట్టాలో అలోచిస్తున్నట్లు తెలిపారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

డీసీఎం డీకే శివకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement