దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రన్ వేపై టెక్కీ సిగరెట్ తాగుతుండగా, ప్రశ్నించిన సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉత్కర్ష్ గౌతమ్ అనే ఐటీ ఇంజనీరు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విమానం ఎక్కడానికి ముందు రన్ వే మీదకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు, ఇది చూసిన గ్రౌండ్ సిబ్బంది.. సార్.. ఇక్కడ సిగరెట్ తాగరాదు అని చెప్పగా, కోపంతో అతనిపై దాడి చేశాడు. ఏవియేషన్ న్యూస్ అనే ఇన్‌స్టా ఖాతాలో దాడి వీడియో పోస్టు చేయడం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఎయిర్‌పోర్టులో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు గౌతమ్‌ను నో ఫ్లై లిస్టులో చేర్చాలని డిమాండు చేస్తున్నారు. అతనిని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది మందలించినట్లు సమాచారం.


