బస్సు ప్రమాద దృశ్యం
శివమొగ్గ: అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు వంతెన పై నుంచి లోయలోకి పడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1 గంటప్పుడు భద్రావతి తాలూకాలోని వీరపుర సమీపంలో కాగేహళ్ల వద్ద జరిగింది. రేణుకాంబ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దావణగెరె నుంచి చన్నగిరి మీదుగా భద్రావతికి వస్తోంది. అయితే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడింది. బస్సు డ్రైవర్‌తో సహా ఐదుమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు కలిసి బాధితులను బయటకు తీసి భద్రావతి ఆస్పత్రికి తరలించారు. ఫైర్ అధికారి ప్రశాంత్, సిబ్బంది బాబు, మంజునాథ్, హరీష్, ప్రజ్వల్ పాల్గొన్నారు.
భద్రావతి వద్ద ప్రమాదం
ఐదుమందికి గాయాలు


