భర్త బతికుండగానే వితంతు పింఛన్‌ తీసుకున్న భార్య..! | Living Man Death Certificate | Sakshi
Sakshi News home page

భర్త బతికుండగానే వితంతు పింఛన్‌ తీసుకున్న భార్య..!

Mar 31 2026 11:24 AM | Updated on Mar 31 2026 11:44 AM

Living Man Death Certificate

బెంగళూరు: బతికున్న వ్యక్తి చనిపోయాడని పాలికె అధికారులు డెత్‌ సరి్టఫికెట్‌ ఇచ్చారు. ఆ పత్రం ద్వారా అతని భార్య రేషన్‌ కార్డు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కిద్వాయి ఆస్పత్రిని మోసం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మహబూబ్‌ బాషా (39), షబానా దంపతులు గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. నా భర్త చనిపోయాడంటూ షబానా ప్రచారం చేసుకుని గతేడాది ఏప్రిల్‌ 23న డెత్‌ సర్టిఫికెట్‌ను తెచ్చుకుంది. వితంతు మహిళగా ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ సౌకర్యాలను          తీసుకుంటోంది.

ఇది తెలిసి మహబూబ్‌ బాషా లబోదిబోమంటూ కోర్టుకెళ్లారు. చిక్కపేటలోని జనన–మరణ రిజి్రస్టార్‌ ఈ డెత్‌ సర్టిఫికెట్‌ను జారీ చేశారని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ అధికారులు విచారణ చేశారు. షబానా తన భర్త పేరుపై ఉన్న బీపీఎల్, ఆధార్‌ కార్డును ఉపయోగించి కిద్వాయి ఆస్పత్రిలో మరో వ్యక్తికి చికిత్సలు చేయించింది. అయితే అతడు చనిపోయాడు. అతడు తన భర్తేనని సిబ్బందికి తెలిపింది. అతని పత్రాలన్నీ బాషా పేరుపైనే ఉన్నాయి. దీనితో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రాలతో ఆమె సులభంగా డెత్‌  సర్టిఫికెట్‌ను సంపాదించింది.  

Advertisement
 
Advertisement
Advertisement