ఎన్‌ఆర్‌బీసీ ఆయకట్టుకు అందని నీరు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌బీసీ ఆయకట్టుకు అందని నీరు

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

నీరు లేక ఎండిన కాలువ(ఫైల్‌)

ఎమ్మెల్యే కరెమ్మ నాయక్‌

రాయచూరు రూరల్‌: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్క ముఖం వేసుకున్నారు. మూడు జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్‌ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీరందించక పోవడంతో పంటలు వాడు ముఖం పట్టాయి.

పంట నష్టం వివరాలు:

యాదగిరి జిల్లాలో శహాపుర, సురపుర, హుణసిగి, వడిగేర, నారాయణపుర, రాయచూరు జిల్లాలో లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు ప్రాంతాల్లో వరి, మిరప, సజ్జ పంటలు పండిస్తున్నారు. యాదగిరి ప్రాంతంలో దాదాపు రెండు లక్షలు, రాయచూరు జిల్లాలో లక్ష, విజయపుర జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి, సజ్జ, మిరప పంటలను పండిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయక పోవడంతో పంటలు చేతి కొచ్చే అవకాశం లేదు. కాలువలో నీటి సామర్థ్యం, గేజ్‌ నిర్వహణ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపుర డ్యాంకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేస్తే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారు.

ఏప్రిల్‌ 20 వరకు నీరు విడుదల చేయాలి:

తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్‌ నెలాఖరు వరకు చివరి భూములకు నీరందివ్వాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ డిమాండ్‌ చేశారు. రెండు రోజుల పాటు పాదయాత్రను చేపట్టారు. ఎండుతున్న పంటలను చూసైనా నీటిని విడుదల చేయాలని ఆమె అన్నారు.

ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్‌ వరకు నీరందించాలి

నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్‌ నెలాఖరు వరకు చివరి భూములకు నీరందించాలని మాజీ మంత్రి రాజుగౌడ డిమాండ్‌ చేశారు.

కాలువ కింద ఎండుతున్న

వాణిజ్య పంటలు

సుమారు ఆరు లక్షల

హెక్టార్లలో పంట నష్టం

కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో

రైతుల ఆక్రందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement