సేంద్రియ పుచ్చ సాగు.. లాభాలు బహు బాగు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ పుచ్చ సాగు.. లాభాలు బహు బాగు

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

హొసపేటె: తండ్రికొడుకు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పుచ్చకాయలను విజయవంతంగా పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తండ్రి పూర్తికాలపు రైతు కాగా, కొడుకు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయం చేయడానికి సమయం కేటాయిస్తాడు. ఈ విధంగా అతను పాక్షికకాలపు రైతుగా మారి తన తండ్రికి సహాయం చేస్తున్నాడు. విజయనగర జిల్లాలోని ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన రైతు రాజ్‌కుమార్‌ సుమారు ఐదు ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పుచ్చకాయలను పండిస్తున్నారు. అతని కుమారుడు సచిన్‌ తండ్రికి సహాయం చేస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు సుమారు 7 ఎకరాల భూమి ఉంది. అతను 3–4 సంవత్సరాలుగా పుచ్చకాయలను పండిస్తున్నాడు. ఈ సంవత్సరం ఉద్యాన శాఖ నుంచి సమాచారం పొందిన తరువాత పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించి పుచ్చకాయలను పండించారు.

రూ.3 లక్షల పెట్టుబడితో పంట సాగు

ఈ సంవత్సరం అతను 5 ఎకరాల భూమిలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి పుచ్చకాయలను పండించాడు. అతని కుమారుడు సచిన్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తాడు. తండ్రికి పుచ్చకాయ పంట పండించడంలో సహాయం చేయడానికి సచిన్‌ మూడు నెలల పాటు తన కంపెనీ పనికి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత పుచ్చకాయలను కోసి కుప్పలుగా పోసిన తర్వాత అతను తిరిగి తన కంపెనీ పనికి వెళతాడు. ఈ విధంగా అతను కంపెనీ పనికి సెలవు తీసుకుని తన తండ్రికి మద్దతు ఇస్తున్నాడు. మట్టికి దూరంగా ఉంటూ కంపెనీ ఉద్యోగాల కోసం వెంపర్లాడే యువతకు అతను ఒక ఆదర్శంగా నిలిచారు.

తోటి రైతులకు ఆదర్శంగా నిలిచిన వైనం

విజయనగర జిల్లాలో ఓ రైతు విజయగాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement