చింతామణి: బైకును కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు బాలలు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధి బెంగుళూరు రోడ్డు చాపుర దగ్గర సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. చింతామణి పట్టణానికి చెందిన అల్లాబకాష్ (16) హర్ష (16), రంజిత్‌లు బైక్‌లో చాపుర దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్తున్నారు. బైక్‌ను ఓ వైపునకు తిప్పగా, వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గూరూ ఎగిరిపడ్డారు. ముగ్గురికీ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పొలాల్లోకి దూసుకువెళ్లగా అందులోనివారు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. స్థానిక ప్రజలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు పంపించారు. ఎస్‌ఐ ప్రకాష్, పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలు బైక్‌లు వేసుకుని ఇష్టానుసారం నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోయారు.
పిల్లల బైక్‌ను ఢీకొన్న కారు
ముగ్గురికి తీవ్రగాయాలు


