దొడ్డబళ్లాపురం: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తురువెకెరె తాలూకా మైసంద్ర గ్రామం నివాసి ముత్తురాజు (26), మధుగిరి తాలూకా కరడిపుర గ్రామానికి చెందిన శ్రీనివాస్ (38)ను కుదూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరు టీ దాసరహళ్లిలో నివసిస్తున్నారు. శుక్రవారం గుడేమారనహళ్లి వద్ద బేకరీలో జ్యూస్ తాగుతూ పక్కనే నిలబడి ఉన్న అంబిక అనే మహిళ మెడలోంచి చైన్ లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలికి గాయాలయ్యాయి. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి 24 గంటల్లోపు అరెస్టు చేశారు.


