నుజ్జయిన కారు బానెట్, అద్దం
ప్రమాదంలో దెబ్బతిన్న బైక్
తీవ్రంగా గాయపడిన తిప్పేష్
హొసపేటె: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. కూడ్లిగి తాలూకా జుట్టిలింగనహట్టికి చెందిన తిప్పేష్ (31) అనే వ్యక్తి సొంత బైక్‌పై పని మీద వెళుతున్నాడు. ఈ క్రమంలో మసీదు వద్ద యూటర్న్ తీసుకుని వెళుతుండగా కానాహొసహళ్లి నుంచి కూడ్లిగి వైపు అతివేగంగా వెళ్తున్న కారు దూసుకొచ్చి బైక్‌ను బలంగా ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎగిరిపడి రోడ్డుపైకి బలంగా తాకడంతో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్థానికులు హుటాహుటిన కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి కానాహొసహళ్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


