హొసపేటె: జిల్లాలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు, రవాణాను పూర్తిగా నియంత్రించి, జిల్లాను మద్యపాన రహిత జిల్లాగా మార్చాలని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి సూచించారు. తన కార్యాలయంలో అక్రమ మద్యంపై జరిగిన స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. అక్రమ మద్యం తయారీ, వ్యాపారంపై అధికారులు చురుకుగా వ్యవహరించాలి. అక్రమ మద్యం అమ్మకాలు లేదా రవాణా జరుగుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పొరుగు జిల్లాలు లేదా రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరిగే అవకాశం ఉన్నందున జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ అనుమానాస్పద ప్రదేశాలపై నిరంతరం దాడులు చేయాలన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మాదేశ్, ఏఎస్పీ మంజునాథ్, ఏడీసీ బాలకృష్ణ, ఏసీ వివేకానంద, వివిధ శాఖల జిల్లా, తాలూకా స్థాయి అధికారులు హాజరయ్యారు.
అధికారులకు కలెక్టర్ కవిత సూచన


