హొసపేటె: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. సుమారు 70 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడి మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు పంచ, నీలం రంగు ఫుల్ షర్ట్, పచ్చ రంగు టవల్ ధరించాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో అతని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


