రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతంతో మరమ్మతులు చురుకుగా కొనసాగుతున్నాయి. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి ఈనె 11 తేదీన కాలువ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కొప్పళ తాలుకా బసాపూర్ వద్ద కాలువకు గండి పడటంతో నీరు వృథాగా ప్రవహించిన విషయం తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో 60 అడుగుల మేర కాలువ కోతను పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిప్పర్లతో మట్టిని తీసుకెళ్లిని గండిని పూడుస్తున్నారు. గండి పూడ్చివేత పనులను త్వరగా పూర్తి చేస్తామని సంబంధిత శాఖ ఇంజనీర్లు తెలిపారు.


