కోలారు: క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చు. క్రీడలు మానసిక, దైహిక ఆరోగ్యానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి ఎంతో సహకారి అవుతాయని జేడీఎస్ నాయకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని దొద్దహసాళ గ్రామంలో గంగోత్రి క్రికెటర్స్ యువకర బళగ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొరత లేదన్నారు. వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానం అని తెలిపారు.


