సాక్షి, బళ్లారి: ఉగాది పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కొత్త సంవత్సరానికి నాంది పలికే పవిత్రమైన సందర్భంగా భావించాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బ్యాంకర్స్ కాలనీలో జిల్లా కళాకారుల సంఘం, సంస్కార్ భారతి తదితర సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. ఉగాది పచ్చడిలో చేదు ,తీపి తదితర షడ్రుచులు ఉన్నట్లుగానే ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఉంటాయని గుర్తు చేశారు. పరాభవ నామ సంవత్సరం అంటే అపజయం కాదని.. కష్టపడి పని చేసే వారికి, మంచి మార్గంలో నడిచే వారికి అన్ని శుభాలు కలుగుతాయని జ్యోతిషులు చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు యల్లనగౌడ, రాజశేఖర పాల్గొన్నారు.


