రథోత్సవం.. పులకించిన జనం | - | Sakshi
Sakshi News home page

రథోత్సవం.. పులకించిన జనం

Mar 21 2026 5:12 AM | Updated on Mar 21 2026 5:12 AM

హొసపేటె: నగరంలోని నెహ్రూ కాలనీలో శుక్రవారం సన్నక్కి వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో హొసపేటె నగరం కిటకిటలాడింది. తొలుత సన్నక్కి వీరభద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం రథంపై కొలువుదీర్చారు. భక్తుల సమూహం రథంపై పూలు చల్లుతూ భక్తిని చాటుకున్నారు. పూజ అనంతరం సన్నక్కి వీరభద్రేశ్వరుడి ఆలయానికి కుడివైపున పూలు పడిన తర్వాత రథాన్ని లాగడం ప్రారంభించారు. డాక్టర్‌ బసవలింగ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు చేశారు. కుడి వైపున పుష్పాన్ని ఉంచిన తర్వాత భక్తులతో కలసి రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి పూలు, పండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు విచ్చేయడంతో హొసపేటె జనసంద్రంగా మారింది. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగర జిల్లా అదనపు ఎస్పీ మంజునాథ్‌, టీబీ డ్యాం సీపీఐ మహమ్మద్‌ గౌస్‌ నేతృత్వంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

భక్తిశ్రద్ధలతో

సన్నిక్కి వీరభద్రేశ్వరుడి రథోత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

మార్మోగిన వీరభద్రేశ్వరుడి నామస్మరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement