కింగ్ కోబ్రాలకు అవినీతి కాటు
శివాజీనగర: కింగ్ కోబ్రా.. అదే రాచనాగు..లేదా గిరినాగు.. ఏదైనా కానీ ప్రపంచంలోని అతి పెద్ద విషపూరిత సర్పాల్లో ఇదే అగ్రస్థానంలో ఉంటుంది. కానీ దానికి కూడా అవినీతి కాటు పడింది. జూ అధికారులు నిధులు భోంచేశారని, ఫలితంగా కింగ్ కోబ్రాలు ఆకలితో మాడిపోయాయని సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. మంగళూరు సమీపంలోని పిలికుల నిసర్గధామ జూ పార్క్‌లో ఈ బాగోతం బయటపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందులోనే కింగ్ కోబ్రాల సంతానోత్పత్తి కేంద్రం ఉంది. సరైన పోషణ, ఆహారం లేక పిల్ల పాములు మరణించాయని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా జూపార్క్‌లో పర్యవేక్షణ లేక అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలున్నాయి. కింగ్ కోబ్రాల సంతానాభివృద్ధి కేంద్రానికి రూ. 2 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. 2022 జూలైలో గుడ్లు పొదిగి 36 పిల్ల సర్పాలు జన్మించాయి. ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియడం లేదు. సిబ్బంది మాత్రం చార్మాడి ఘాట్ అడవిలో వదిలేసినట్లు చెబుతున్నారు. ఇందుకు అటవీశాఖ అనుమతి ఉండాలి. కానీ అటవీ శాఖ మాకు తెలియదు అని చెబుతోంది. పిల్లలను వదిలిన ఆధారాలు కూడా లేవు. ఈ వ్యవహారాలపై కొందరు జంతుప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
గురువారం బెళగావిలో రోడ్ల పక్కన వివిధ రకాల డోళ్లు విక్రయిస్తున్న తయారీదారులు. త్వరలో హోళీ పండుగ వస్తుండగా, డోళ్లకు గిరాకీ ఉంటుందని ఉత్తరాది నుంచి ఈ వ్యాపారులు వచ్చారు
పోషణ లేక పిల్లలు మృత్యువాత!
పిలికుల జూలో కలకలం
కింగ్ కోబ్రాలకు అవినీతి కాటు


