పల్లెల్లోనూ చైన్ స్నాచింగ్
మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని అగర మాంబల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సురపుర గ్రామంలో మహిళ మెడలోని బంగారు హారాన్ని దుండగుడు లాక్కెళ్లాడు. వివరాలు.. కమలమ్మ ఇంటి వెనుక కొట్టంలో ఉన్న ఆవుకు మేత వేయడానికి వెళ్ళినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు రూ. 6 లక్షల విలువైన 45 గ్రాముల హారాన్ని తెంచుకుని పారిపోయాడు. యలందూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించారు. పల్లెల్లోనూ చైన్ స్నాచింగ్‌లు జరగడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
మైసూరు బస్టాండులో...
ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు చోరీ చేసిన ఘటన మైసూరు గ్రామీణ బస్టాండ్‌లో జరిగింది. చెన్నపట్టణ తాలూకావాసి పుట్టమ్మ బస్టాండులో తమ ఊరి బస్సు ఎక్కుతుండగా ప్రయాణికుల రద్దీలో గొలుసు మాయమైంది. గొలుసు బరువు 30 గ్రాములని ఆమె లష్కర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


