కలబుర్గిని ఉప రాజధానిగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కలబుర్గిని ఉప రాజధానిగా ప్రకటించాలి

Feb 18 2026 7:04 AM | Updated on Feb 18 2026 7:04 AM

కలబుర్గిని ఉప రాజధానిగా ప్రకటించాలి

కలబుర్గిని ఉప రాజధానిగా ప్రకటించాలి

రాయచూరు రూరల్‌: కర్ణాటకలో అతి పెద్ద డివిజన్‌గా పేరొందిన కలబుర్గిని ఉప రాజధానిగా ప్రకటించాలని కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడు గుండేరావ్‌ పేర్కొన్నారు. కలబుర్గి బాపూగౌడ రంగమందిరంలో 22వ జిల్లా కసాప ఉత్సవాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రెవెన్యూ విభాగంలో కూడా పెద్ద ప్రాంతమన్నారు. హంపీ ఉత్సవాల మాదిరిగా కలబుర్గి డివిజన్‌లో రాష్ట్రకూట, నాగావి, సన్నతి ఉత్సవాలను చేపట్టాలన్నారు. రూ.వేలాది కోట్లతో పాఠశాలలు నిర్మించినా ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. గడినాడు ప్రాంతాల్లో కన్నడ భాషను ప్రోత్సహించాలన్నారు. ఇతర భాషల ప్రభావం కన్నడ భాషకు గొడ్డలి పెట్టుగా ఉందన్నారు. ఇతర భాషలను గౌరవిస్తూస్తు కన్నడకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌, సోమశేఖర్‌, శ్రీశైల, స్వామిరావ్‌, సంజయ్‌, జగన్నాథ్‌, కళ్యాణప్ప, రమేష్‌, శివానందలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement