మీడియానే నాకు దారి చూపింది
● ఎంపీ యదువీర్
మైసూరు: మైసూరు–కొడగు కూడా అభివృద్ధి చెందిన భారతదేశం లాగా.. అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మారాలి అని స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ అన్నారు. మానస గంగోత్రిలోని సైన్స్ భవన్‌లో మైసూర్ జిల్లా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జరిగిన పత్రికా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నేను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, నాకు అనుభవం లేదన్నారు. తరువాత, మీడియా ఇచ్చిన ఉపయోగకరమైన సలహాలు, మార్గదర్శకత్వం వల్ల ఏదైనా సాధించడం సాధ్యమైంది. మైసూర్–కొడగు హైవే, రైల్వే లైన్, యాదవగిరిలో కొత్త రైల్వే స్టేషన్, భారతీయ భాషా సంస్థ లో కన్నడ కోసం ప్రత్యేక అధ్యయన వ్యవస్థ, హుణసూరు,, పిరియాపట్టణం వంటి ప్రదేశాలలో రైతులకు పథకాల పంపిణీ మొదలైనవి సాధ్యమవుతున్నాయి అని చెప్పారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అది మైసూరు వారసత్వం, ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి అన్నారు. శ్రీహరి ద్వారకానాథ్, పాత్రికేయులు శివానంద తగడూర్, హరిప్రసాద్, కె. దీపక్, రవి పాండవపుర, ధర్మపుర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఎంపీ సన్మానించారు.


