గీతా టాలెంట్ షోకు విశేష స్పందన
మైసూర్: అమెరికాతో పాటు పలు దేశాల్లో జరుగుతున్న ’గీతా టాలెంట్ షో’ ద్వారా భగవద్గీత భక్తుల ఇళ్లకు చేరుకుంటోందని మైసూర్‌లోని అవధూత ఆశ్రమ పీఠాధ్యక్షుడు శ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ అన్నారు. ఆశ్రమంలోని నాదమంటపంలో ఆదివారం నిర్వహించిన గీతా మైత్రి మిలన్ కర్ణాటక 2.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ గీతా పోటీలను అమెరికాలో పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. బాలలు ఎంతో ఆసక్తితో వచ్చి భగవద్గీతను పారాయణం చేస్తున్నారన్నారు. భగవద్గీతలోని అంశాలపై సంధించిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తూ అబ్బురపరుస్తున్నారన్నారు. అమెరికా మాత్రమే కాకుండా యూరప్, దుబాయ్, కెనడా, వెస్టిండీస్ ప్రజలు కూడా ఎంతో భక్తితో పాల్గొంటున్నారన్నారు. వారి ఆంగ్ల శైలి అర్థం కాకపోయినా, భగవద్గీత నేర్చుకోవడంలో వారి భక్తి, అంకితభావం ప్రశంసనీయమని స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తన కుటుంబం యొక్క భక్తి కారణమని గోవింద్ గిరి జీ గుర్తుచేసుకున్నారు.
గీతా టాలెంట్ షోకు విశేష స్పందన


