సోమేశ్వరాలయంలో మహా కుంభాభిషేకం
కోలారు : తాలూకాలోని మదనహళ్లి గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ సమేత పార్వతీ దేవి, సోమేశ్వరస్వామి, బలమురి గణపతి, నూతన దేవాలయ స్థిరబింబ, అష్టభందన ప్రతిష్టాపనా, విమానగోపుర, మహా కుంభాభి షేక, పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు కుమార దీక్షిత్ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, ఎంపీ మల్లేష్‌బాబు, ముళబాగిలు ఎమ్మెల్యే సమృధ్దిమంజునాథ్ పాల్గొన్నారు. మదనహళ్లి, గుట్టహళ్లి, కల్లూరు, తిమ్మాపుర, మూరాండహళ్లి, దొడ్డగానహళ్లి, కెందట్టి గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు.


