అనప రుచుల సంభ్రమం
మైసూర్: మైసూరు నగరంలోని నంజరాజ బహదూర్ సత్రంలో సహజ సమృద్ధి, సహజ సీడ్స్ ఇన్స్‌టిట్యూట్ ఆధ్వర్యంలో రెండు రోజుల మాగీ మేళా కోలాహలంగా ఆరంభమైంది. అనపగింజలతో చేసిన రకరకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వక్తలు మాట్లాడుతూ ఆయా కాలాల్లో లభించే పప్పుధాన్యాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. హైబ్రిడ్ రకాల దినుసులను తగ్గించాలని తెలిపారు. నాటు శనగలు శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి, హైబ్రిడ్ అనప ఏడాది పొడవునా లభిస్తుంది, కానీ ఆ అనపకు రుచి, వాసన ఉండదు. హైబ్రిడ్ పంటలు ఎక్కువ తెగుళ్లకు గురవుతాయి అని చెప్పారు. కొత్తగా పండించిన నాటు శనగలు, వేరుశనగలు, రకరకాల సిరి ధాన్యాలు, బంగాళాదుంపలు, బఠానీలు మొదలైనవి ఈ మేళాలో అమ్మకానికి వచ్చాయి. అనప కేసరిబాత్, జామూన్‌లు, బజ్జీలు, రొట్టెలు–కూరలు ఇలా అనేక వంటకాలను నోరూరిస్తాయి. అలాగే ఎప్పుడూ చూడనన్ని రకరకాల అనప జాతుల గింజలు ప్రదర్శిస్తున్నారు.
మైసూరులో మాగీ మేళా
దేశీయ ధాన్యాల ప్రదర్శన
అనప రుచుల సంభ్రమం
అనప రుచుల సంభ్రమం


