కొత్త ఏడాదికి గట్టి భద్రత
బనశంకరి: కొత్త ఏడాదికి మరో 15 రోజులే మిగిలి ఉండడంతో సంబరాల వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో కారు బాంబు పేలుడు, గోవా పబ్‌లో అగ్ని ప్రమాదం వంటివి ఇక్కడ జరగకుండా సోదాలు చేపట్టారు. పబ్‌లు, రెస్టారెంట్లకు వెళ్లి న్యూ ఇయర్ ఏర్పాట్ల గురించి సమాచారం సేకరించి సూచనలు చేస్తున్నారు. డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు చోటివ్వరాదని హెచ్చరిస్తున్నారు. అలాగే జన రద్దీ నివారణ కు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు అనేదానిపై దృష్టి పెట్టినట్లు ఉత్తర విభాగం డీపీపీ బీఎస్.నేమగౌడ తెలిపారు. ఎంజీ.రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, కోరమంగల 80 ఫీట్‌రోడ్డు, ఇందిరానగర 100 ఫీట్‌రోడ్డు తో పాటు కొత్త ఏడాది వేడుకలు ఆర్భాటంగా జరిగే ప్రముఖ స్థలాల్లో తనిఖీలను చేపట్టారు.
మహిళా హాస్టళ్లలో జాగ్రత్త
పీజీ హాస్టళ్లలో నియంత్రణ పాటించాలని తెలిపారు. 31 రాత్రి నుంచి మహిళా పీజీల వద్దకు పురుషులను రానివ్వరాదని తెలిపారు. ఏవైనా అసాంఘిక ఘటనలు జరిగితే దానికి పీజీ యజమానులదే బాధ్యత అని పోలీసులు మార్గదర్శకాలలో హెచ్చరించారు. వేడుకలు జరిగే అన్నిచోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్‌లకు సూచించారు. కస్టమర్ల బ్యాగు, లగేజీలను చెక్ చేయాలని, ఆయుధాలు, పేలుడు వస్తువులు, గంజాయి, డ్రగ్స్ లేవని ధ్రువీకరించుకోవాలని సూచించారు.
బెంగళూరులో హోటళ్లు, పబ్‌లలో
పోలీసుల తనిఖీలు


