సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి దోహదం
బెంగళూరు టెక్‌సమ్మిట్‌ను ప్రారంభిస్తున్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్
టెక్ సమ్మిట్‌లో రోబనాయిడ్‌తో సందర్శకురాలు కరచాలనం
బనశంకరి: సాంకేతిక పరిజ్ఞానం, స్పేస్‌టెక్, స్టార్టప్స్ విధానాలను ప్రభుత్వం అమలు చేసింది, సాంకేతిక రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరు నగరంలోని బీఐఈసీలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే 28వ ఎడిషన్ బెంగళూరు టెక్ సమ్మిట్–2025ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–డేటా సాంకేతిక పరిజ్ఞానంతో కర్ణాటక సమాచార సాంకేతిక పరిజ్ఞాన విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక నిలయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బెంగళూరు టెక్ సమ్మిట్– 2025 ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. పెట్టుబడులు, పరిశోధనలకు ప్రపంచ వేదికగా మారిందన్నారు.
ఇది సరికొత్త అధ్యాయం
బెంగళూరు టెక్ సమ్మిట్– 2025లో ప్రపంచ స్థాయిలో 600 మందికి పైగా ప్రపంచ స్థాయి వక్తలు, 1,200 మంది ప్రదర్శకులు, 60 దేశాలకు చెందిన కమిటీలు వేలాది మంది పారిశ్రామికవేత్తలు కర్ణాటక లేదా భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానంగా ఉంటారని సీఎం వ్యాఖ్యానించారు.
మార్కెట్‌లో కర్ణాటక ప్రతిభకు నాంది
బెంగళూరు టెక్ సమ్మిట్– 2025 కూడా మార్పు దిశగా ఉందని, ఇది విద్యా, ఉద్యమ రంగానికి అనుసంధానంగా ఉంటూ పెట్టుబడిదారులను సంప్రదిస్తుందని ప్రపంచ మార్కెట్‌లో కర్ణాటక ప్రతిభకు నాందిగా ఉంటుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అందరికీ సామాజిక ఆర్థిక న్యాయం సుస్థిర అభివృద్ధి సాధించాలనేది తమ ధ్యేయమన్నారు. ఏఐ, క్వాంటమ్, బయోటెక్, అంతరిక్ష పరిజ్ఞానంతో డిజిటల్ విప్లవంతో బెంగళూరు టెక్‌సమ్మిట్ కర్ణాటకను ప్రపంచం వైపు ఆహ్వానిస్తుందని సీఎం తెలిపారు. దశాబ్దాలుగా బెంగళూరును భారత్ సిలికాన్ వ్యాలీగా పిలుస్తున్నారని, నేడు కర్ణాటక ప్రతిభ పరిశోధనలు సాంకేతికతతో ప్రపంచ కేంద్రంగా నిలిచిందన్నారు. 85 యూనివర్శిటీలు, 243 ఇంజినీరింగ్ కాలేజీలు, సుమారు 1,800 ఐటీఐలు ఉన్నాయని, రాష్ట్రంలో 4.3 శాతం తక్కువ నిరుద్యోగ రేటు కలిగి ఉందన్నారు.
200 ఎకరాల్లో సెమికండక్టర్ పార్కు
రాష్ట్రంలో 200 ఎకరాల్లో సెమికండక్టర్ పార్కు ఏర్పాటు చేసి కంపెనీలకు అవసరమైన సకలసౌలభ్యాలు కల్పిస్తామని భారీపరిశ్రమలు శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ తెలిపారు. డ్రోన్, సెమికండక్టర్, సౌరవిద్యుత్, ఇండస్ట్రీ 5.0 ఇతర అత్యాధునిక పారిశ్రామిక విధానాలపై దృష్టిసారించామని తెలిపారు. పెట్టుబడిదారులు రావాలంటే పరిశోధన, అభివృద్ధి బాగుండాలని, కర్ణాటకలో 800కు పైగా ఆర్‌అండ్‌బీ కేంద్రాలు, వందకుపైగా పైగా చిప్‌విన్యాస కంపెనీలు, 18,300 పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య
బెంగళూరులో టెక్ సమ్మిట్ ప్రారంభం
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి దోహదం


