విదేశీ డ్రగ్స్‌పెడ్లర్ల అరెస్ట్
బనశంకరి: బెంగళూరు నగరంలో డ్రగ్స్‌దందాకు పాల్పడుతున్న 14 మంది విదేశీయులతో పాటు 19 మంది డ్రగ్స్‌పెడ్లర్లను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.7.7 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను పరిశీలించిన అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల నుంచి 2.804 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్, 2.100 కిలోల హైడ్రోగంజా, బైక్, ఏడు మొబైల్స్‌తో పాటు రూ.7.7 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుద్దగుంటెపాళ్య పరిధిలో డ్రగ్స్ విక్రయాల్లో నిమగ్నమైన నైజీరియా మహిళ మార్వలస్ గ్లోరిని అరెస్ట్ చేసి రూ1.52 కోట్ల విలువ చేసే 760 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, స్కూటర్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అద్దె ఇంట్లో ఉండి దందా
మహదేవపుర పరిధిలో ప్రవీణ్‌కుమార్, యశవంత్, రాహుల్‌కృష్ణ, అభయ్, సంతోష్‌కుమార్, రోహన్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రూ.60 లక్షల విలువ చేసే 600 గ్రాముల హైడ్రోగంజాయి, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు మహదేవపురలోని బీ.నారాయణపురలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రముఖ డ్రగ్స్‌పెడ్లర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నారు. వర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌పెడ్లింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి కెన్యాకు చెందిన మహిళా డ్రగ్స్‌పెడ్లర్ పోబినా మెసియాను అరెస్ట్ చేశారు. రూ.4.08 కోట్ల విలువ చేసే 2.044 కిలోల ఎండీఎంఏ క్రిస్టల్ మొబైల్స్, ఎలక్ట్రానిక్ యంత్రం స్వాధీనం చేసుకున్నారు.
11 మంది విదేశీయుల అరెస్ట్
ఎలాంటి ఆధారాలు లేకుండా నగరంలో నివసిస్తున్న 11 మంది విదేశీపౌరులను అరెస్ట్ చేసి దేశబహిష్కరణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి యజమాని శివరామకృష్ణ, సంగప్ప పాటిల్‌పై చట్టానికి వ్యతిరేకంగా విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇచ్చారని, విదేశీ పౌరులు యాక్ట్– 1946 సెక్షన్ 7(2) సెక్షన్–211 కింద కేసు నమోదు చేశామన్నారు.
విదేశీ టూరిజం వీసాతో ఎంట్రీ
పట్టుబడిన కెన్యా మహిళ విదేశీ పర్యటన వీసాతో భారత్‌కు చేరుకుని కామనహళ్లిలో హెయిర్ డ్రెసర్‌గా పని చేస్తోంది. నైజీరియా, టాంజానియాకు చెందిన ఇద్దరు డ్రగ్స్‌పెడ్లర్లతో డ్రగ్స్ కొనుగోలు చేసి పరిచయస్తులైన కస్టమర్లకు అధిక లాభానికి విక్రయిస్తోంది. కేజీ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో విదేశీ తపాలా కార్యాలయానికి విదేశాల నుంచి వచ్చిన అనుమానాస్పద పార్శిల్స్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయని అందిన పక్కా సమాచారం ఆధారంగా రూ.1.5 కోట్ల విలువ చేసే హైడ్రోగంజాయి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
19 మంది నిందితుల పట్టివేత
రూ.7.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం


