ప్రధాన సిఫార్సులు
● తల్లిదండ్రుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు శిక్షణ, డిజిటల్ సాక్షరతల్లో ప్రమాదాలను నియంత్రించే దృష్టితో చర్యలు
● పాఠశాలలు, సముదాయాలు, ఐసీటీ సంస్థలతో కూడిన అభియాన్, సెమినార్ల ద్వారా డిజిటల్ సురక్షత ప్రోత్సాహం
● ఆన్‌లైన్ ప్రమాదాలు, సురక్షత ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య ముక్తసరిగా ప్రోత్సాహం
● పాఠశాల పాఠ్యాంశాల్లో ఆన్‌లైన్ సురక్షత చేర్చడం, వయస్సుకు సరైన టూల్‌కిట్స్ అభివృద్ధి, ఇంటర్నెట్ వినియోగం పట్ల పర్యవేక్షణ చేయడంపై సెమినార్
● ఆన్‌లైన్ వేధింపులకు బలైన పిల్లలకు జిల్లా స్థాయి సహాయవాణి, ప్రత్యేక పిల్లలు రక్షణా సేవలను కల్పించడానికి చర్యలు
● సమాలోచన, చట్టపరంగా సాయం, పునర్వసతి అందించడానికి ఎన్‌జీలతో కూడిన సహకారం
● డిజిటల్ సురక్షత గురించి పిల్లలకు విద్య అందించడానికి పాఠశాలలకు మానవ వనరుల అభివృద్ధి
● పిల్లలకు ఆన్‌లైన్ వేధింపుల నియంత్రణకు చర్యలు, కఠిన సైబర్ నేరాలు, చట్టాలు అమలు చేయాలని సూచించింది.
● పిల్లలు ఆన్‌లైన్ వేధింపులకు సంబంధించి నివేదిక సిఫార్సు అమలు చేయడానికి ఐటీబీటీ మంత్రిని కలిశామని పిల్లలకు ఆన్‌లైన్ సురక్షత గురించి తెలియజేయడంతో పాటు 18 ఏళ్లలోపు పిల్లలు వినియోగించే మొబైల్స్‌లో సురక్షితం కాని, అశ్లీల యాప్‌లకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోవాలని ఈ దృష్టితో సిఫార్సు చేస్తామని బాలల హక్కుల కమిషన్ అధ్యక్షుడు శశిధర్ కోసంబె తెలిపారు.


