15–18 ఏళ్ల పిల్లలపై ఎక్కువ వేధింపులు
పిల్లలు ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, దుర్వినియోగానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో తీవ్ర సమస్యగా మారింది. పిల్లలు శారీరక, భావనాత్మక, మానసిక యోగక్షేమాలపై తీవ్రప్రభావం చూపుతుంది. సామాజిక మాధ్యమ వేదికలు, ఆన్‌లైన్ గేమింగ్, చాట్‌రూమ్‌లను వినియోగించుకుని పిల్లలను వేధిస్తున్నారు. సాధారణంగా 15–18 ఏళ్ల వయస్సు గల పిల్లలు ఇలాంటి వేధింపులు అధికంగా ఉంటాయి. వేధింపులకు గురైన ఆడపిల్లల కంటే మగపిల్లలు అధికం. కోవిడ్ అనంతరం యువతీ యువకుల్లో సోషల్ మీడియా ప్రభావం అధికమైంది. 90 శాతం పిల్లలు, యువతీ యువకులు, 99 శాతం మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వాడుతున్నారు. ప్రత్యేకంగా 15–18 ఏళ్ల వయస్సుకు చెందినవారు ఆన్‌లైన్‌లో అభద్రతాభావం, వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు 77 శాతం ఇన్‌స్ట్రాగామ్ ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం 34 శాతం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 43 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు స్క్రీనింగ్ సమయం పరిమితంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులకు ఆన్‌లైన్ గురించి అవగాహన లేదు.


