Karnataka
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2025
బాలికలతో అసభ్య ప్రవర్తన
చింతామణి: చదువు చెప్పాల్సిన పాఠశాల హెడ్‌మాస్టర్ విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ బాలికలు తరగతులను బహిష్కరించి తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ ఘటన తాలూకాలోని దొడ్డగంజూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. సదరు పాఠశాలో 57 మంది విద్యార్థినులు చదువుతుండగా 50 మంది బాలికలు హాస్టల్‌లోనే ఉంటారు. అయితే ఓబయ్య అనే హెడ్‌మాస్టర్ పదవ తరగతి చదువుతున్న బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. గమనించిన బాలికలు తమ తల్లిదండ్రుల దృష్టికి తెచ్చారు. బాలికలను విచారించారు. అయితే హెడ్‌మాస్టర్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని లేకపోతే తమ పిల్లలను పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకొని మంగళవారం ఆందోళనకు దిగారు. ధర్నా సమయంలో బాలికలు కన్నీరు పెడుతూ కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకొన్న బీఈఓ ఉమాదేవి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షులు అశోక్ కుమార్ అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను పంపిస్తానని వచ్చిన తరువాత చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వగా హెచ్‌ఎంను బదిలీ చేయాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. హెచ్‌ఎంను నెలపాటు సెలవుపై పంపుతామని బీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. చౌడరెడ్డి, ప్రభావతి, గంగాధరప్ప, సుజాత, శ్రీనాధ, బైరమ్మ, శోభా, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
యడియూరప్పకు సమన్లు
బనశంకరి: పోక్సో కేసును ఎదుర్కొంటున్న మాజీ సీఎం బీఎస్.యడియూరప్పతోపాటు నలుగురికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం సమన్లు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కొద్దిరోజుల క్రితం ట్రయల్‌కు అనుమతిచ్చింది. ప్రస్తుతం 1వ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు బీఎస్.యడియూరప్పతో పాటు నలుగురికి సమన్లు జారీచేసి డిసెంబరు 2న కోర్టుకు హాజరుకావాలని సూచించింది.
బనశంకరి: రాష్ట్రంలో ప్రతి ఆరు మంది పిల్లల్లో ఒకరు ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్న దిగ్భ్రాంతికర విషయం తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తోంది. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్, చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం నివేదికలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నివేదిక విడుదలైంది. సురక్షతా చర్యలు గురించి సిఫార్సు లేఖ అందించడానికి కమిషన్ సిద్ధమైంది. శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్ యుగంలో పిల్లలు అధికంగా ఆన్‌లైన్‌తో అనుబంధం కలిగి ఉండటం, ఇంటర్నెట్ విద్య, సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో సాంకేతిక పరిజ్ఞానం విశాలమైన అవకాశాలు కల్పిస్తుండటంతో పాటు యువ మనస్సులను ఆకట్టుకుంటుంది. డిజిటల్ యుగంలో నిమగ్నమైన పిల్లలను ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, దూషించడం తదితర చర్యలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడే దృష్టితో ముందస్తు చర్యలు తీసుకోవడం గురించి అధ్యయనం చేశారు.
రాష్ట్రంలో మొదటి ప్రయోగం
పిల్లలు ఎదుర్కొనే ఆన్‌లైన్ ప్రమాదాలు పరిధిని అన్వేషించడం, డిజిటల్ ప్రపంచంలో పిల్లలను కాపాడటానికి అవసరమైన సిఫార్సులను అందించాలనే లక్ష్యంతో కర్ణాటకలో మొదటిసారిగా సమగ్ర అధ్యయనం చేశారు. ఈ నివేదిక పిల్లల సురక్షతను ఆన్‌లైన్‌లో ధృవీకరించడానికి జాగృతి, డిజిటల్ సారక్షత, దృఢమైన నివేదిక అందించే కార్యవిధానాలు అత్యవసర చర్యలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చట్టం రూపకర్తలు, చట్టం అమలు చేసే సంస్థలు, సముదాయాలు సురక్షిత డిజిటల్ పరిసరాలను సృష్టించడానికి కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చింది.
తరగతులను బహిష్కరించి రోడ్డుపై ధర్నా
ముఖ్యోపాధ్యాయుడి బదిలీకి డిమాండ్
తప్పు చేసి ఉంటే చర్యలు తప్పవు: బీఈఓ
ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు బలిపశువు
సంయుక్త సర్వేలో విషయం వెలుగులోకి
ఆన్‌లైన్ వేధింపులకు
గురైన పిల్లల వివరాలు
రాష్ట్రంలో 2022 జనవరి నుంచి 2025 జూలై వరకు 315 మంది పిల్లలు ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. 2022లో 105 మంది, 2023లో 117 మంది, 2024లో 66 మంది, 2025 జూలై వరకు 27 మంది వేధింపులకు గురయ్యారు. బెంగళూరు నగర, గ్రామీణ జిల్లా, బెళగావి నగర, ఉత్తరకన్నడ, మంగళూరు, మైసూరు జిల్లా నగర ప్రదేశాల్లో అధిక కేసులు వెలుగు చూశాయి.
Karnataka
Karnataka


