గ్రామాలకు బస్సులు నడపరూ
రాయచూరు రూరల్: గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని వివిధ గ్రామాల ప్రజలు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మస్కి ఆర్టీసీ డిపో వద్ద ఏఐడీవైఓ సంచాలకుడు శరణప్ప మాట్లాడారు. తాలూకాలోని బసాపుర, గోన్వార గ్రామాల ప్రజలు, విద్యార్థుల తరపున ఆ గ్రామాలకు బస్సులను నడపాలని అభ్యర్ధించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి లింగసూగూరుకు వెళ్లడానికి ఒక్క బస్సు మాత్రమే నడుస్తోందన్నారు. కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆయా గ్రామాల ప్రజలు ఒకే బస్సును అవలంబించాల్సి వస్తోందన్నారు. అదనపు బస్సులను నడపాలని కోరుతూ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.
పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని ఇళ్లు, భూ పోరాట సమితి అధ్యక్షుడు మారెప్ప పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రారష్ట్‌ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములను సన్నకారు రైతులకు పంచే అవకాశం ఉన్నా అధికారులు రైతులపై కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పు బట్టారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు, రాజకీయ నాయకుల కుమ్మక్కుతో వాటిని లాక్కొంటున్నట్లు ఆరోపించారు. పేదలకు గూడు, కూడు, గుడ్డ అనే సామెతకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలను అందించాలన్నారు.
బసవేశ్వరునికి
ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో వెలసిన దిడ్డి బసవేశ్వర జాతర, కార్తీక దీపోత్సవం, సంగీత కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం దిడ్డి బసవేశ్వర ఆలయంలో బసవేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిేషేకం నిర్వహించారు. దిడ్డి బసవేశ్వర స్వామి ఆలయ అధ్యక్షుడు వీరభద్రయ్య స్వామి, అమరేశ గౌడ, బసవరాజ్, సురేష్ స్వామి, ప్రకాష్ సజ్జన్, మంజు పాటిల్‌లున్నారు.
అక్రమ బియ్యం బస్తాల పట్టివేత
రాయచూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా హనుమాపూర్‌లో ఎన్. మల్కాపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి చెందిన బియ్యాన్ని ప్రధానోపాధ్యాయుడు, వంట చేసే కార్మికులు ఏకమై బియ్యాన్ని లగేజ్ ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు వాటిని స్వాధీనం చేసుకొని ఆహార, విద్యా శాఖాధికారులకు అప్పగించారు.
ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు మృతి
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరుకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు, పేదల పెన్నిధి దండమూడి రాధాకృష్ణ(84)శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆదివారం సింధనూరులో అంత్యక్రియలు జరిగాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగుల పాలిట పెన్నిధిగా ఉండేవారని ప్రజలు కొనియాడారు. ఆయనకు భార్య శిరోమణి, కుమారుడు డాక్టర్ సుధీర్, కూతుర్లు డాక్టర్ సుజాత, సునీతలున్నారు. అంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మెట్లపల్లి నుంచి వచ్చి సింధనూరులో స్థిరపడ్డారు. దండమూడి రాధాకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ కలిసి కలబుర్గిలోని వైద్య కళాశాలలో నాడు వైద్యవిద్యనభ్యశించారు. రాధాకృష్ణ మృతి పట్ల కమ్మ సంఘం నేత గారపాటి రామకృష్ణ, సూర్యదేవర నాగేశ్వరరావు, బీ.ప్రసాద్, సూర్యదేవర వెంకటేశ్వరరావు తదితర పలువురు ప్రవాసాంధ్రులు సంతాపం వ్యక్తం చేశారు.
గ్రామాలకు బస్సులు నడపరూ
గ్రామాలకు బస్సులు నడపరూ
గ్రామాలకు బస్సులు నడపరూ


