శిశు మరణాలను అరికట్టాలని ధర్నా
కేజీఎఫ్ : తాలూకాలోని గట్టహళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న శిశు మరణాలను అరికట్టాలని స్వాభిమాని మోహన్‌కృష్ణ వర్గం కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం గట్టహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఆందోళనకారులు మాట్లాడుతూ శిశువు మరణానికి కారణమైనట్లు ఆరోపణలున్న డాక్టర్ నాగవేణికి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేజీఎఫ్ ప్రభుత్వ ఆస్పత్రి కూడా శిశు మరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. ఆస్పత్రికి సరైన సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. ఆస్పత్రిలో తగిన సౌకర్యాలను కల్పించి మరణాలు కొనసాగకుండా చూడాలని డిమాండ్ చేశారు.


