కేసులను వేగంగా పరిష్కరించాలి
రాయచూరురూరల్: క్షణికావేశంలో చేసిన తప్పులతో శిక్ష అనుభవిస్తున్న కక్షి దారుల కేసులను వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విబూ బఖ్రు పిలుపునిచ్చారు. దేవదుర్గలో నూతన కోర్టువనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయం, చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి తాలూకా కేంద్రంలో కోర్టు భవనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శివరాజ్‌పాటిల్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అను శివరామన్, షుకారే కమల్, భరతకుమార్, శశిధరశెట్టి, సాత్విక్, సురేష్, రఫీక్, జిల్లా అధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి బసవేశ్వర జాతర
రాయచూరురూరల్: సిరవార తాలుకా అత్తనూరులో వెలసిన దిడ్డి బసవేశ్వరుడి జాతర సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు బసవేశ్వర దేవాలయం అధ్యక్షుడు వీరభద్రయ్య పేర్కొన్నారు. పిరవార పాత్రికేయులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయం వద్ద బసవేశ్వరుడికి సోమవారం అభిషేకం, సాయంత్రం సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు సమక్షంలో సహస్ర దీపోత్సవం, కార్తిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంగీత విభావరి, పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అమరేశగౌడ, బసవరాజ్, సు రేష్, ప్రకాష్‌సజ్జన్, మంజుపాటిల్ పాల్గొన్నారు.
మాత తిమ్మక్కకు సంతాపం
రాయచూరురూరల్: వందల మెక్కలు నాటి పెద్ద చెట్లుగా మార్చిన మహా సాధ్వి మరద తిమ్మక్క అని రాయచూరు వీరసావర్కర్ సంఘం గ్రీన్ సంచాలకుడు రాజేంద్ర అభివర్ణించారు. స్థానిక సావర్కర్ చౌక్ వద్ద మాత మరద తిమ్మక్క మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రాజేంద్ర మాట్లాడుతూ తనకు సంతానం కలగలేదనే భావనను ప్రక్కనపెట్టి మొక్కలనే తమ పిల్లలుగా భావించి నాటిందన్నారు. ఆమె నాటిన మొక్కలు ఎందరికో విశ్రాంతిని ఇస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, చామరాజ, విజయ్‌కుమార్, వెంకటేష్, ధనుంజయ్, రోహిత్, మహేష్, అనిల్, విశ్వనాథ్, మధుసూదన్, నరేష్, భరత్, జనార్దన్ పాల్గొన్నారు.
ఆక్రమణలు తొలగించాలి
రాయచూరు రూరల్: నగరంలో ఆక్రమణలను తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు జాఫర్ షరీఫ్ డిమాండ్ చేశారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. జిల్లా అధికారి శివానందని శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జాఫర్ షరీఫ్ మాట్లాడుతూ నగరంలోని 27, 28, 29వ వార్డులలో అంగళ్లు, హోటళ్లు, మెకానిక్ దుకాణ యజమానులు ప్రధాన రహదారులను ఆక్రమించడంతో ప్రజలు నడవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోరారు.
రైతుల ఆందోళన
రాయచూరురూరల్: అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాయచూరు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని దేవదుర్గ తాలుకా రైతులు డిమాండ్ చేశారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద అందోళన చేపట్టారు. అధిక వర్షాలకు ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన వరి, కంది, పత్తి పంటలను రైతులు నష్టపోయారని, వారికి నష్ట పరిహారం అందించాలని కోరారు. స్థానిక అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కేసులను వేగంగా పరిష్కరించాలి
కేసులను వేగంగా పరిష్కరించాలి
కేసులను వేగంగా పరిష్కరించాలి
కేసులను వేగంగా పరిష్కరించాలి


