అమృత మహోత్సవం
రాయచూరురూరల్: అధునిక సాంకేతిక యగంలో యువకులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజ్ అన్నారు. నగరంలోని ఎల్‌వీడీ కళాశాల అవరణంలో జరుగుతున్న అమ్రత మహోత్సవ వేడుకలు ఆదివారం ముగిశాయి. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం, విశ్రాంతి, సామాజిక భద్రత అవసరమని, అప్పుడే వారిలో ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. పాఠ్యాంశాలతోపాటు, ఇతర సాంకేతిక, వృత్తిపరమైన అంశాలపైనా వారికి అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సుఖాణి, రిజిస్ట్రార్ చెన్నప్ప, అంబాపతి పాటిల్, పురుషోత్తం, శ్రీనివాస్, చేతన్ పాల్గొన్నారు.
విజ్ఞాన కేంద్ర భవనం నిర్మాణం
దేశంలో విజ్ఞాన రంగం అభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజ్ అన్నారు. నగరంలోని విజ్ఞాన కేంద్రంలో ప్రాంతీయ విజ్ఙాన కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో పాపారెడ్డి, నరసమ్మ, సాజిద్, సుఖాణి, జుబీన్ మోహపాత్రో, రాజు బాస్కర్, సదాశివ, తదితరులు పాల్గొన్నారు.


