మంత్రిమండలి ప్రక్షాళన? | - | Sakshi
Sakshi News home page

మంత్రిమండలి ప్రక్షాళన?

Nov 17 2025 8:36 AM | Updated on Nov 17 2025 8:36 AM

మంత్ర

మంత్రిమండలి ప్రక్షాళన?

శివాజీనగర: రాష్ట్రంలో అధికాపక్షం కాంగ్రెస్‌లో భారీ మార్పులు చేర్పుల గురించి చర్చ జరుగుతోంది. బిహార్‌ ఎన్నికల రాష్ట్ర కాంగ్రెస్‌ మీద హైకమాండ్‌ చూపు సారిస్తుందని గత 6 నెలల నుంచి ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి మార్పు, కేపీసీసీ అధ్యక్షుని మార్పు, మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణ గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. మంత్రులు కూడా బిహార్‌ ఎన్నికల తరువాత మార్పులు ఉంటాయని అనేక సందర్భాల్లో ప్రకటించారు.

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలను భేటీ చేసి చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి కావడం, మంత్రిమండలి మార్పులు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. పదవులు లేక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించాలని, పనితీరు సరిగా లేని మంత్రులను సాగనంపాలని భావించారు, దీంతో మంత్రివర్గ ప్రక్షాళనకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సుదీర్ఘకాలం ఢిల్లీ యాత్రలు, తర్జనభర్జనల తరువాత మంత్రిమండలికి సర్జరీకి నాయకత్వం అంగీకరించింది. ఈ వార్త ఎమ్మెల్యేలకు సంతోషం కలిగిస్తుండగా, కొందరు మంత్రులకు వణుకు పుట్టించింది. కనీసం 10నుండి 15 మంది మంత్రులను తొలగించే చాన్సులు కనిపిస్తున్నాయి. వారి స్థానాల్లో కొత్త ముఖాలకు, యువకులకు అవకాశం కల్పించవచ్చని సమాచారం.

ఢిల్లీలోనే డీసీఎం శివ

ప్రక్షాళనకు నాయకత్వం లాంఛనంగా ఆమోదం తెలియజేసిన నేపథ్యంలో, సీఎం సిద్దరామయ్య సోమవారం కూడా మరోసారి రాహుల్‌గాంధీ టీంతో చర్చలు జరపనున్నారు. ఈ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, కేపీసీసీ సారథి డీకే శివకుమార్‌ వైఖరి రహస్యంగా ఉంది. మంత్రిమండలి విస్తరణలో కేపీసీసీ నేతగా డీకే సిఫార్సులు ముఖ్యం కాబోతున్నాయి. ప్రక్షాళన ముహూర్తం ఎప్పుడు, ఎవరిని తీసేయాలి, ఎవరికి పట్టం కట్టాలి అనేది చర్చించాల్సి ఉంది. శనివారం ఢిల్లీకి వెళ్లిన శివకుమార్‌

రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలను భేటీ చేసే అవకాశముంది. తనకు ముఖ్యమంత్రి పదవి గురించి, తన వర్గం వారికి మంత్రి పదవుల గురించి విన్నవించే అవకాశముంది.

వేడెక్కిన పవర్‌హౌస్‌ రాజకీయాలు

పెద్దసంఖ్యలో మంత్రులు ఇంటికి!

ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌తో సీఎం సిద్దు భేటీ

కొత్త ముఖాలకు పదవులు

కేబినెట్‌లోకి ఎవరెవరు ఇన్‌?

బీ.కే.హరిప్రసాద్‌

యూ.టీ.ఖాదర్‌ (స్పీకర్‌)

కే.ఎన్‌.రాజణ్ణ

ఆర్‌.వీ.దేశపాండె

ఎం.కృష్ణప్ప

తన్వీర్‌సేట్‌

సలీం అహమ్మద్‌

రిజ్వాన్‌ అర్షద్‌

మాగడి బాలకృష్ణ

రూపకళా శశిధర్‌

గోపాలకృష్ణ బేళూరు

మంత్రిమండలిలో ఎవరు ఔట్‌?

మంత్రిమండలి ప్రక్షాళన? 1
1/2

మంత్రిమండలి ప్రక్షాళన?

మంత్రిమండలి ప్రక్షాళన? 2
2/2

మంత్రిమండలి ప్రక్షాళన?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement