అన్నదాతకు ఆసరాగా కృషి మేళా
నూతన వంగడాల గురించి తెలుసుకుంటూ..
పొద్దుతిరుగుడు పొలం వద్ద సందర్శకుల తాకిడి
బెంగళూరు (బనశంకరి): గత మూడురోజులుగా సిలికాన్ సిటీలోని జీకేవీకే ఆవరణలో జరుగుతున్న వ్యవసాయ మేళా ఆదివారం జనజాతర ను తలపించింది. 13వ నుంచి ప్రారంభమైన మేళాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాక పొరుగున ఉన్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల నుంచి రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు తరలివచ్చి విశేషాలను తెలుసుకున్నారు.
వేడి బెల్లం, పురుగుల వంటలు
మండ్య జిల్లాకు చెందిన రైతు గానుగలు వేసి వేడి వేడి బెల్లం తయారుచేశారు. ఈ దుకాణం వద్దకు పెద్దఎత్తున జనం వచ్చి వేడివేడి బెల్లం రుచి చూశారు. అలాగే మరో స్టాల్‌లో పలు రకాల కీటకాలతో విభిన్న వంటకాలను తయారుచేశారు. చైనా, వియత్నాం వంటి దేశాల్లో కీటకాల వంటలకు ఎంతో ఆదరణ ఉందని తెలిపారు.
వైవిధ్యమైన స్టాళ్లు
గృహ వినియోగ అలంకరణ వస్తువులు, కీటకాలతో పంటలకు తలెత్తే ఉపయోగాలు గురించి పలు స్టాళ్లలో సమాచారం అందించారు. గాడిద పెంటను ఎరువుల ప్యాకెట్లుగా విక్రయించారు. ఇటీవల రోజుల్లో కుంభారులు కనుమరుగు అవుతుండటంతో ప్రాచీన కళ కూడా అంతరిస్తోందని తెలిపారు. ఇందుకోసం యువ సమాజానికి కుండల తయారీ గురించి తెలియజేసేందుకు ఓ స్టాల్‌ను ఏర్పాటుచేశారు. విద్యార్థులు బంకమట్టితో కుండలు తయారుచేసి ఆనందించారు. మేళాలో సూర్యకాంతి పంట వద్ద యువత, మహిళలు సెల్ఫీల కోసం ఎగబడడంతో రద్దీ నెలకొంది.
అన్నదాతలకు సన్మానం
పలు రకాల ఎద్దులు, ఆవులు, దున్నలు, యంత్రపరికరాల స్టాళ్ల వద్ద కొనుగోళ్ల సందడి నెలకొంది. రాయితీ ధరలో భోజనాల స్టాళ్లలో గిరాకీ నెలకొంది. సుమారు 30 లక్షలమంది మేళాను వీక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు. చివరగా పలు జిల్లాల ఉత్తమ రైతులను సన్మానించారు. ఆదివారం సాయంత్రంతో రైతు మేళా సమాప్తమైంది.
4 రోజుల్లో 30 లక్షల మంది సందర్శన
సమాప్తమైన సంబరం
అన్నదాతకు ఆసరాగా కృషి మేళా
అన్నదాతకు ఆసరాగా కృషి మేళా
అన్నదాతకు ఆసరాగా కృషి మేళా
అన్నదాతకు ఆసరాగా కృషి మేళా


