భార్య కుట్రకు భర్త బలి
మైసూరు: భార్యభర్తలు బైక్‌లో వెళ్తుండగా దొంగలు అడ్డుకుని నరికి వెళ్లిపోయారు, తీవ్రగాయాలైన భర్త ఆస్పత్రిలో చనిపోయాడు. అయితే ఇది భార్య వేసిన కుతంత్రమని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. మైసూరు జిల్లా నంజనగూడులో ఈ కిరాతకం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 26వ తేదీన నంజనగూడు తాలూకాలోని హుండువినహళ్ళి లేఔట్‌లో రాజేంద్ర (31), భార్య సంగీతతో కలిసి స్కూటర్‌లో వెళ్తున్నాడు, కారులో వచ్చిన ముగ్గురు దుండగులు బైక్‌ను అడ్డుకుని రాజేంద్రను వేట కొడవలి, కత్తులతో నరికి పారిపోయారు. తీవ్ర గాయాలైన అతన్ని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా 21 రోజులకు పైగా మృత్యువుతో పోరాడుతూ ఆదివారం చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దుండగులను అరెస్టు చేయగా అసలు విషయం బయట పడింది.
ఆమే సూత్రధారి
రాజేంద్ర భార్యనే దాడి చేయాలని ఆదేశించిందని చెప్పాడు. ఆమె అక్రమ సంబంధం, ఆస్తి గొడవలే కారణమని సమాచారం. కిల్లర్ భార్య, ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. నిందితుల్లో ఆమె మైనర్ తమ్ముడు ఉన్నాడు. రాజేంద్ర ప్లైవుడ్ పనిచేస్తుండగా, సంగీత ఓ ప్రభుత్వ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్.
భార్య, ఆమె తమ్ముడు, ఇద్దరు దుండగుల అరెస్టు
భార్య కుట్రకు భర్త బలి


