ధూమ్‌ సినిమా స్ఫూర్తిగా దోపిడీలు | - | Sakshi
Sakshi News home page

ధూమ్‌ సినిమా స్ఫూర్తిగా దోపిడీలు

Nov 17 2025 8:36 AM | Updated on Nov 17 2025 8:36 AM

ధూమ్‌ సినిమా స్ఫూర్తిగా దోపిడీలు

ధూమ్‌ సినిమా స్ఫూర్తిగా దోపిడీలు

బనశంకరి: ధూమ్‌ సినిమాలో హీరోలు బైక్‌ల మీద దూసుకెళ్తూ దోపిడీలకు పాల్పడుతూ జల్సాలు చేయడం చూసే ఉంటారు. వారిని చూసి స్ఫూర్తి పొందిన ఓ ఖతర్నాక్‌ దొంగ ఉదంతమిది. అయితే పోలీసులు అతనిని అరెస్టు చేసి భారీగా సొత్తును, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు.. బెళగావి వద్ద యమకనమరడి గ్రామంలో ఓ వైద్యుడు కుటుంబంతో సహా గత నెల 16వ తేదీన బెంగళూరుకు వచ్చారు. ఇంట్లో ఎవరులేకపోవడంతో దొంగ సురేశ్‌నాయక్‌ 22వ తేదీ రాత్రి ఇంట్లోకి చొరబడి కోట్లాది రూపాయల విలువచేసే 1,250 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదును దోచుకుని ఉడాయించాడు. వారం తరువాత ఇంటికి వచ్చిన వైద్యుడు చోరీని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యమకనమరడి పోలీసులు తీవ్రంగా గాలించి సురేశ్‌నాయక్‌ ను అరెస్ట్‌చేసి బంగారు, వెండి సొత్తు, కొంత నగదు, కారు, మహేంద్ర జీపు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

జాన్‌ అబ్రహాంను చూసి

సురేశ్‌నాయక్‌ నటుడు జాన్‌ అబ్రహాం అభిమాని, అతని సినిమాలు చూసి అలాగే చేయాలనుకున్నాడు, పల్సర్‌ బైక్‌లో తిరుగుతూ ధనవంతుల ఇళ్లలో చోరీలకు పాల్పడి ఆ సొమ్ముతో గోవాలో విలాస జీవనం గడిపేవాడు. బంగారాన్ని మహారాష్ట్రలో విక్రయించేవాడు. ఇతడిపై 22 చోరీ కేసులు ఉండడం విశేషం.

బెళగావిలో ఖతర్నాక్‌ దొంగకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement