రెట్టింపు లాభాలంటూ రూ.కోట్ల టోపీ
దొడ్డబళ్లాపురం: వారం రోజుల్లోనే ఇచ్చిన డబ్బు రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపిన ఘరానా దంపతులు కోట్ల రూపాయలు వసూలు చేసుకుని పరారైన సంఘటన దావణగెరెలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా రాయదుర్గంవాసులైన బొగ్గు శ్రీరాములు, భార్య పుష్ప ఈ మోసానికి పాల్పడ్డారు. దావణగెరె జిల్లా జగళూరులో వీరు కొంతకాలంగా నివసిస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. వారంలోనే డబ్బులు రెట్టింపు చేసి ఇస్తామని ఆశచూపి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
భూమిని అమ్మి ఇస్తే..
రేణుకమ్మ అనే మహిళ భూమిని విక్రయించి రూ.33 లక్షలు, మీనా రూ.40 లక్షలు, ప్రియాంక రూ.50 లక్షలు, తిరుమలేశ అనే వ్యక్తి రూ.17 లక్షలు.. ఇలా అనేకమంది పెద్ద మొత్తాల్లో వారి చేతుల్లో పెట్టారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి రెట్టింపు ఇస్తామని దంపతులు నమ్మబలికారు. అయితే నెలరోజుల నుంచి హఠాత్తుగా దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అడ్రస్ లేకపోవడంతో పాటు ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితులు రాయదుర్గం, అనంతపురానికి వచ్చి ఆరా తీసినా జాడలేదు. దీంతో జగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఉమా ప్రశాంత్ జగళూరుకు వచ్చి బాధితులతో మాట్లాడారు.
దావణగెరె జిల్లాలో అనంతపురం
దంపతుల ఘరానా వంచన


