మాంత్రికుడు.. ఉమ్మెత్త గింజలు | - | Sakshi
Sakshi News home page

మాంత్రికుడు.. ఉమ్మెత్త గింజలు

Nov 17 2025 8:36 AM | Updated on Nov 17 2025 8:36 AM

మాంత్రికుడు.. ఉమ్మెత్త గింజలు

మాంత్రికుడు.. ఉమ్మెత్త గింజలు

బాగేపల్లి (భాగ్యనగరం): ఇరుగుపొరుగు ఇళ్లవారు ఓ అడుగు స్థలం కోసం గొడవపడి సాంబారులో విషం కలిపిన ఘటనలో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. హత్య చేయడానికి ఉమ్మెత్త మొక్క గింజలను వాడినట్లు గుర్తించారు.

బాగేపల్ళి తాలూకాలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య నిందితుడు పాపిరెడ్డి.. గుడిబండ తాలూకాలోని గరుడాచార్ళహళ్ళి గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మాంత్రికునికి రూ.10 వేలు ఇచ్చి విషం కలిపిన ఉమ్మెత్త విత్తనాలను తెప్పించి పొడిచేసి బాధితుడు ముద్దారెడ్డి ఇంటిలో సాంబారులో కలిపినట్లు తెలిపారు. దీంతో ఆ మాంత్రికున్ని కూడా అరెస్టు చేశారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్దారెడ్డి, ఆయన కుటుంబీకులు కోలుకుంటున్నారు.

సాంబారులో విషం కేసులోఅరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement