అక్రమ మద్యం విక్రయాలపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం విక్రయాలపై ఆగ్రహం

Nov 17 2025 8:36 AM | Updated on Nov 17 2025 8:36 AM

అక్రమ మద్యం విక్రయాలపై ఆగ్రహం

అక్రమ మద్యం విక్రయాలపై ఆగ్రహం

రాయచూరురూరల్‌: రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. అక్రమంగా మద్యం విక్రయాలను వ్యతిరేకిస్తూ బెళగావి, బాగల్‌కోట, విజయనగరం, కలబుర్గి, ధారవాడ జిల్లాల్లో మహిళా నారీమణులు కదం తొక్కారు. వెంటనే విక్రయాలను నిలిపివేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహిళలు మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకోవడానికి మహిళలకు పూర్తిస్థాయి అధికారం అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ దుకాణాల్లో విక్రయించే మద్యానికి బ్రేక్‌ వేయాలని, చిన్న పిల్లలు మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పది రోజుల్లో పుల్‌స్టాప్‌ పెట్టకపోతే నవంబర్‌ 25న బెంగళూరులో పెద్ద ఎత్తున అందోళన చేపడుతున్నామన్నారు.

కదం తొక్కిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement