తిమ్మక్క సేవలు అమోఘం | - | Sakshi
Sakshi News home page

తిమ్మక్క సేవలు అమోఘం

Nov 17 2025 8:36 AM | Updated on Nov 17 2025 8:36 AM

తిమ్మక్క సేవలు అమోఘం

తిమ్మక్క సేవలు అమోఘం

హొసపేటె: ప్రకృతికి, మనిషికి మధ్య సంబంధాన్ని గుర్తు చేసిన సాలు మరద తిమ్మక్క సేవలు అమోఘమని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ పరమశివమూర్తి తెలిపారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వృక్ష తల్లి, సాలు మరద తిమ్మక్క మరణం కన్నడ విశ్వవిద్యాలయానికి తీవ్ర దుఃఖాన్ని కలిగించిందన్నారు. కన్నడ విశ్వవిద్యాలయం జనవరి 13, 2010న తిమ్మక్క సాధించిన విజయాలను గుర్తించి నాడోజ డిగ్రీని ప్రదానం చేసిందన్నారు. డిప్యూటీ చాన్సలర్‌ బి.గురుబసప్ప, డీన్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

జ్ఞాన సముపార్జనకు

గ్రంథాలయాలు అవశ్యం

రాయచూరురూరల్‌: జ్ఙాన సముపార్జనకు విద్యార్థుల కు గంథాలయాలు అవశ్యమని గ్రంథాలయాధికారి నిర్మల పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నెహ్రూ చిత్రపటానికి పూలహారం వేసి మాట్లాడారు. విద్యార్థులు జ్ఙాన సంపాదనకు గ్రంథాలయాల్లో పుస్తకాలను చదవడం నేర్చుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement