చెరువులకు నీరందించండి | - | Sakshi
Sakshi News home page

చెరువులకు నీరందించండి

Nov 16 2025 10:33 AM | Updated on Nov 16 2025 10:35 AM

రాయచూరు రూరల్‌: బెళగావి జిల్లా రాయబాగ తాలూకాలోని 39 చెరువులకు కృష్ణా నది నుంచి నీరందించాలని చిక్కోడి లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక జార్కిహోళి అధికారులను ఆదేశించారు. శనివారం చిక్కోడి తాలూకా భావన సౌదత్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందించేందుకు వీలు కల్పించినట్లు తెలిపారు. అధికారులు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తాగు, సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

దేవదాసి మహిళలకు పునర్వసతి కల్పించాలి

రాయచూరు రూరల్‌: దేవదాసి మహిళలకు పునర్వసతి కల్పించాలని రాష్ట్ర దేవదాసి మహిళా సమాఖ్య వేదిక డిమాండ్‌ చేసింది. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విభు బుఖ్రా, అను శివరామన్‌, షుకారే కమల్‌లకు విన్నవించారు. దేవదాసి మహిళలకు నెలకు రూ.5 వేల పెన్షన్‌, భూమి, వారి సంతానానికి విద్యాభ్యాసం కోసం అనుమతులు కల్పించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.

సహకార సంఘాలతో

ఆర్థిక సమానత్వం

రాయచూరు రూరల్‌: ప్రజల సామాజిక, ఆర్థిక సమానత్వం మెరుగునకు సహకార సంఘాలు అవసరమని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ధ్వజారోహణ, 72వ అఖిల భారత రాష్ట్ర స్థాయి సహకార ఉత్సవాలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. వస్తు ప్రదర్శనలు ప్రారంభించి ప్రసంగించారు. సామాజిక భద్రతకు పునాదిరాయి లాంటి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి, కేఓఎఫ్‌ రాష్ట్రాధ్యక్షుడు వెంకట్రావ్‌ నాడగౌడ, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌, హంపయ్య నాయక్‌, ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌, రాయచూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ పాటిల్‌ తోరణదిన్ని, ఆర్‌ఏపీఎంసీ అధ్యక్షుడు జయంత్‌ రావ్‌ పతంగి, సహకార మహా మండలి అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ పాటిల్‌లున్నారు.

వృక్షమాతకు జెస్కాం ఉద్యోగుల సంతాపం

రాయచూరు రూరల్‌: జెస్కాం పరిధిలో గ్రామీణ భాగంలో విధులు నిర్వహిస్తున్న 94 మంది అధికారులకు పదోన్నతులకు అవకాశం కల్పించాలని రెండవ రోజున జెస్కాం ఉద్యోగులు ఆందోళన జరిపారు. శనివారం జెస్కాం డివిజనల్‌ కార్యాలయం వద్ద జెస్కాం ఉద్యోగుల సంఘం సంచాలకుడు జీఎల్‌ గోపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. శుక్రవారం మరణించిన వృక్ష మాత సాలుమరద తిమ్మక్క మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తాత్కాలిక జాబితాలో ఉన్న పేర్లలో ఆక్షేపణలకు సమయం ముగిసినా అధికారులు పదోన్నతులకు కాలయాపన చేయకుండా ఆదేశాలను జారీ చేయాలన్నారు.

విద్యార్థులు జ్ఞానాన్ని

సంపాదించుకోవాలి

రాయచూరు రూరల్‌: విద్యార్థులు జ్ఞానసముపార్జన కోసం విద్యనభ్యసించాలే తప్ప అధిక మార్కుల కోసం కాదని సీనియర్‌ అధ్యాపకురాలు మీనాక్షి బాళే వెల్లడించారు. శనివారం కలబుర్గి హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంస్థ బాలికల కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని జ్ఞానం పొందాలన్నారు. మార్కులు సాధించాలని పోతే జీవితానికే అపాయం కలుగుతుందన్నారు. కన్నడ భాష, నీరు, భూమిపై గౌరవంగా ఉంటూ రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మహేష్‌ గంగ్వార్‌, అనిత, అశోక్‌, గీత, రాజశ్రీ, శిల్పకళ, శోభ, అనసూయ, సవిత, జానకి, విజయలక్ష్మి, ఆనంద్‌లున్నారు.

చెరువులకు నీరందించండి1
1/4

చెరువులకు నీరందించండి

చెరువులకు నీరందించండి2
2/4

చెరువులకు నీరందించండి

చెరువులకు నీరందించండి3
3/4

చెరువులకు నీరందించండి

చెరువులకు నీరందించండి4
4/4

చెరువులకు నీరందించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement