ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా కవితాళ ఎంపిక
రాయచూరు రూరల్ : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ఇతరత్ర విషయాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సేవలు, కార్యాలయాన్ని సుందరంగా ఉంచుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం రాయచూరు జిల్లా సిరవార తాలూకా కవితాళ పోలీస్ స్టేషన్‌ను దేశంలో మూడవ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేసింది. కవితాళను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. కవితాళ పోలీస్ స్టేషన్ భవనం, రికార్డుల సర్దుబాటు, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో ేస్నేహ సంబంధాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలోకి కవితాళను మూడవ ఉత్తమ స్టేషన్‌గా గుర్తించారు. ఈ నెల 28న ఐఐఎం రాయ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ఎస్‌ఐ గురుచంద్ర యాదవ్ ట్రోఫీని అందుకోనున్నారు. కాగా 2021లో మాన్వి పోలీస్ స్టేషన్ 5వ స్థానం పొందింది.
దేశంలో మూడో ఉత్తమ పోలీస్
స్టేషన్‌గా గుర్తింపు


