తిమ్మక్కపై పరిశోధనలు రావాలి
హొసపేటె: వృక్షమాత సాలుమరద తిమ్మక్కపై పరిశోధన పత్రాలు ప్రచురించాలని, పీహెచ్‌డీలు తయారు చేయాలని జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పీ.సత్యనారాయణ తెలిపారు. విజయనగర జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ హొసపేటె ప్రెస్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన సాలుమరద తిమ్మక్కకు నివాళి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాలుమరద తిమ్మక్క మన తరానికి, భవిష్యత్ తరాలకు ఎంతో దోహదపడింది. ఆమె 114 సంవత్సరాలు జీవించారు అంటే పర్యావరణంతో మమేకమై ఉన్నారని అర్థం. పద్మశ్రీ అవార్డు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకొన్నారన్నారు. ఇంత సరళమైన, సౌమ్య మహిళ నేడు మన మధ్య లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మణ్, వెంకోబి తదితరులు మాట్లాడుతూ సాలుమరద తిమ్మక్కను పాఠ్యాంశంగా చేర్చడం హర్షణీయమన్నారు. సాలుమరద తిమ్మక్క సాధించిన విజయాలు ఈ తరానికి ఆదర్శమని అన్నారు. జర్నలిస్టులు సీకే నాగరాజ్, భీమరాజ్, సురేష్ చౌహన్, బీ.కుమారస్వామి, ఇందిరా కలాల్, జయప్ప రాథోడ్, శివానంద హొసళ్లి, సంజయ్‌కుమార్, అనూప్ కుమార్, కేబీ.ఖవాస్, పాండురంగ, డీఎస్ ప్రభు, విజయ్‌కుమార్, రాజేష్ పాల్గొన్నారు.


