రాయచూరు రూరల్: పెద్దలు పిల్లలకు విద్యతో పాటు సంస్కారం నేర్పించాలని విజయపుర రామకృష్ణ వివేకానంద ఆశ్రమం అధ్యక్షుడు నిర్భయానంద సరస్వతి పేర్కొన్నారు. శుక్రవారం ఎల్‌వీడీ కళాశాల ఆవరణలో ఆ కళాశాల 70వ అమృత మహోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. విద్యతో పాటు ధర్మం, సనాతన సంప్రదాయాలు, సంస్కారాన్ని అలవర్చుకొనేలా వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో సుఖాణి, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, అరవింద్ ఘోష్, అంబాపతి పాటిల్, పురుషోత్తం, శ్రీనివాస్, చేతన్, పవన్ కుమార్‌లున్నారు.
పదోన్నతులు
కల్పించాలని ధర్నా
రాయచూరు రూరల్: జెస్కాం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 94 మంది అధికారులకు పదోన్నతులకు అవకాశం కల్పించాలని జెస్కాం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం జెస్కాం డివిజనల్ కార్యాలయం వద్ద జెస్కాం ఉద్యోగుల సంఘం సంచాలకుడు హులిరాజ్ మాట్లాడారు. తాత్కాలిక జాబితాలో ఉన్న పేర్లలో ఆక్షేపణలకు గడువు ముగిసినా అధికారులు పదోన్నతులకు అవకాశం కల్పించకుండా కాలయాపన చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ డివిజనల్ ఇంజినీర్‌కు వినతిపత్రం సమర్పించారు.
పన్ను వసూలులో
ముందంజలో ఉండండి
రాయచూరు రూరల్ : నగరంలో పన్ను వసూళ్లలో ముందంజలో ఉండాలని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. శుక్రవారం నగరసభ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, బిల్ కలెక్టర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. నగరంలో 8 బృందాలను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో ఇంటి పన్ను, నీటి పన్ను వసూలును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ నగరసభ పేరుతో ఈ–ఖాతాను త్వరగా ఇస్తారన్నారు. సమావేశంలో నగరసభ సభ్యులు శశిరాజ్, అధికారి మల్లికార్జున పాల్గొన్నారు.
చెరకు రైతులకు
పరిహారం అందించండి
రాయచూరు రూరల్: బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌లో చెరకు వాహనాలకు చెలరేగిన మంటల్లో కాలిపోయిన వాహనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమీర్ వాడి గోదావరి బయో రిఫైనరీ షుగర్స్ పరిశ్రమలో 50 ట్రాక్టర్లకు మంటలు అంటుకున్నాయన్నారు. పరిశ్రమలో చెరకును గానుగ(క్రషింగ్) చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ట్రాక్టర్లలో చెరకును లోడు చేసుకొచ్చారన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సంగన్ క్రాస్ వద్ద కొంత మంది దుండగులు వాటికి నిప్పంటించారన్నారు. సర్కార్ చెరకు రైతుల ఆందోళనపై స్పందించక పోవడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు.
ఎమ్మెల్యేకు చేనేతల సత్కారం
బళ్లారిటౌన్: బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని శుక్రవారం చేనేత వర్గాలు ఘనంగా సత్కరించారు. రూపనగుడి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న హులిగమ్మ చౌడేశ్వరి ఆలయం నూతన పునః ప్రతిష్టాపన పనులను ఆయన పరిశీలించారు. ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్, జీఆర్ వెంకటేశులు ఆలయ పనుల వివరాలను తెలియజేశారు. తొగటవీర క్షత్రియ ప్రముఖులు దేవానంద్, మంజుల, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
విద్యతో పాటు సంస్కారం నేర్పించాలి
విద్యతో పాటు సంస్కారం నేర్పించాలి
విద్యతో పాటు సంస్కారం నేర్పించాలి


