రాయచూరు రూరల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఆచరించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బసవరాజ పాటిల్ ఇటగి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతిని జరిపారు. భారత ప్రధానమంత్రిగా నెహ్రూ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. పంచ శీల సూత్రాలను జారీ చేసి దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల, దరూరు బసవరాజ్, తాయన్న నాయక్, ప్రతిభారెడ్డి, ఎర్రిస్వామి, జ్యోతిలున్నారు.
ఘనంగా బాలల దినోత్సవం
హొసపేటె: బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమం ప్రారంభించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విలువైన సూచనలు, సమాచారం అందించారు. పాఠశాల ముఖ్య ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యా పురోగతిని చర్చించడానికి ఇది మంచి వేదిక అని అన్నారు. విద్యా రంగంలో అనేక పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విద్యను పొందడం ద్వారా సమాజంలో మంచి పౌరులుగా మారాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం అన్నారు. విద్యార్థులు దురలవాట్లకు బానిస కారాదన్నారు. మంచి విద్యనభ్యసించి ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. కర్ణాటక తెలుగు సంఘం అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, హేమలత, నిర్మల, ఈరప్ప, రవి, మంజుల, శారద, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ఎస్‌డీఎంసీ సభ్యులు హాజరయ్యారు.
చాచా నెహ్రూ జయంతి
బళ్లారి అర్బన్: రాష్ట్రంలోని సిద్దరామయ్య సర్కారు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, పంచశీల, ఆర్థిక ప్రణాళికల సూత్రధారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి చాచాజీ దేశానికి చేసిన సేవలను ప్రముఖులు పిల్లలకు వివరించారు. హొస దరోజీలోని పాఠశాల ప్రాంగణంలో చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
డీసీసీ కార్యాలయంలో నెహ్రూ జయంతి
బళ్లారిటౌన్: నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. పార్టీ నేతలు అల్లం ప్రశాంత్, జేఎస్ ఆంజనేయులు, బీ.రాంప్రసాద్, ఆర్‌వీ వెంకటేష్, శివరాజ్ హెగ్డే, ఎల్.మారెణ్ణ, హుమయూన్ ఖాన్, ముండ్రగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ సేవలు అమోఘం
జవహర్ లాల్ నెహ్రూ సేవలు అమోఘం


