థర్మల్ కేంద్రం బొగ్గు హాంఫట్
రాయచూరు రూరల్: రాష్ట్రానికి 60 శాతం విద్యుత్‌ను అందించే రాయచూరు తాలూకా వైటీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గులను అక్రమంగా నిల్వ ఉంచిన అధికారులు, కాంట్రాక్టర్లు భాగస్వాములు కావడం విశేషం. రైల్వే శాఖ, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు బాధ్యులని సంఘం ఆరోపించింది. మూడేళ్ల నుంచి అక్రమంగా సింగరేణి బొగ్గు గనుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా రాయచూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఏర్పాటు చేసిన రైల్వే లైన్లపై యరమరస్‌కు సరఫరా చేసేవారు. యరమరస్ నుంచి యూనిట్‌కు మధ్య రెండు కి.మీ.ల దూరం ఉంది. మధ్యలో రైలు వ్యాగన్లను నిలిపి నాణ్యతతో కూడిన 120 మెట్రిక్ టన్నుల బొగ్గు విలువ రూ.5 కోట్లు కాంట్రాక్టర్, అధికారులపై దొంగతనం చేసినట్లు ఆరోపించారు. ఆర్టీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంట్రాక్టర్ గురు రాఘవేంద్ర ఎంటర్ ప్రైజెస్ యజమానులు, యరమరస్ రైల్వే స్టేషన్ మాస్టార్లను భాగస్వాములుగా గుర్తించారు. నాణ్యతతో కూడిన బొగ్గును దొంగిలించారు. కదిలే రైలు నుంచి కిందపడిన బొగ్గు కాదని నివేదికలో పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి బొగ్గును దొంగిలిస్తున్నట్లు సమాచారం సేకరించారు.
రూ.25 కోట్ల విలువ చేసే బొగ్గు మాయం
అధికారులు, కాంట్రాక్టర్లే భాగస్వాములు
రెల్వే, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం
థర్మల్ కేంద్రం బొగ్గు హాంఫట్


