క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల
హొసపేటె: టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్రీయ విద్యాలయం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ స్థాయి ప్రాథమిక పాఠశాల విభాగం క్రీడా పోటీలు–2025–26ను కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ హేమ, ప్రిన్సిపాల్ మనోహర్ జినగార్ చేతుల మీదగా ప్రారంభించారు. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం, విద్యా శాఖ ప్రతి సంవత్సరం క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా ప్రకాష్, రాజశేఖర్, ఆఫ్తాబ్, ముజీమ్, రమీజా, ఆసియా సుల్తానా, రాహుల్, దీపిక, సునీత మౌర్య, సమీనా, ప్రీతి తదితరులతో పాటు కొప్పళ, దోణిమలై, సింధనూరు, గంగావతి, బళ్లారి, హొసపేటె కేంద్రీయ విద్యాలయల నుంచి వచ్చిన విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల


